ఇగ్నోలో తెలుగు మాధ్యమంలో కొత్త కోర్సులు
ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) కొన్ని కోర్సులను తెలుగు మాధ్యమంలో చేసేందుకు అవకాశం కల్పించింది. ఇగ్నో పరిధిలో ఇప్పటివరకు మూడు కోర్సులు మాత్రమే తెలుగులో ఉండేవి. గ్రామీణులు, మహిళలు, తెలుగు మాధ్యమం విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేయాలనే లక్ష్యంతో కొన్ని కోర్సులను తెలుగు మాధ్యమంలో నిర్వహించేందుకు ఇగ్నో అనుమతి ఇచ్చింది. తెలుగు మాధ్యమంలో ఇగ్నో ప్రస్తుతం మూడు కోర్సుల్లో విద్యను అందిస్తోంది. ఏడాది కాల పరిమితి ఉన్న పాడి పరిశ్రమ, పాల ఉత్పత్తులకు సంబంధించి డిప్లమా ఇన్ డెయిరీ టెక్నాలజీ, కోళ్ల పరిశ్రమకు సంబంధించి సర్టిఫికెట్ ఇన్ పౌల్ట్రీ ఫార్మింగ్. ఇది 6 నెలల్లో పూర్తి చేయవచ్చు. ఎలాంటి విద్యార్హత లేకున్నా బ్యాచులర్ ఆఫ్ ప్రిపరేటరీ ప్రొగ్రాం కోర్సు చేయవచ్చు. కాల వ్యవధి 6 నెలలు. ఫీజు రూ.1000 మాత్రమే. ఈ కోర్సు పూర్తి చేసిన వారు బీఏ, బీకాం డిగ్రీ కోర్సుల్లో నేరుగా ప్రవేశం పొందే అవకాశం కల్పించారు. కొంతమందికి ఫీజులో రాయితీ కూడా కల్పించారు. ఈ కోర్సు పట్టు పరిశ్రమకు సంబంధించింది. కాల వ్యవధి కూడా 6 నెలలే. అనంతపురం జిల్లా హిందూపురంలో పట్టు పరిశ్రమ అభివృద్ధి శిక్షణా సంస్థ ద్వారా ఇగ్నో ఈ కోర్సును ప్రస్తుతం ఆంగ్లంలో అందిస్తోంది. ఈ ఏడాది నుంచి పరీక్షలు తెలుగులో రాసే అవకాశం కల్పించారు. మైసూర్‌కు చెందిన సెంట్రల్ సిల్క్ బోర్డు అనువాద ప్రక్రియను ప్రారంభించింది. వచ్చే ఏడాదికి పూర్తిగా తెలుగులో మెటీరియల్ వస్తుంది. ఈ కోర్సులో చేరాలంటే 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. లేదంటే 8వ తరగతి చదివి, పట్టు పరిశ్రమలో రెండేళ్లపాటు పని చేసిన అనుభవం ఉండాలి. గ్రామీణ విద్యార్థులకు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి 50 శాతం రాయితీ ఇస్తుంది. ఈ ఏడాది డిసెంబరులో జరగబోయే వార్షిక పరీక్షలను 6 నెలల కాల పరిమితి ఉన్న సర్టిఫికెట్ కోర్సుల విద్యార్థులు తెలుగులో పరీక్షలు రాసుకునే సౌలభ్యం కల్పించేందుకు ఇగ్నో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆంగ్ల మాద్యమం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం విజయవాడ ఇగ్నో ప్రాంతీయ కేంద్రం పరిధిలో 500 మంది విద్యార్థులు తెలుగులో పరీక్షలు రాసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం బీఏ, బీకాం కోర్సులు ఆంగ్లంలో ఉన్నాయి. ఈ ఏడాది ఆంగ్లంలో చదివినా తెలుగులో పరీక్షలు రాసుకునే అవకాశం ఇగ్నో కల్పించింది. 2017-2018 విద్యాసంవత్సరం నాటికి డిగ్రీ కోర్సులకు కొత్త సిలబస్ అందుబాటులోకి వస్తుంది. 2018-2019 ఏడాదికి ఈ కోర్సులు పూర్తిగా తెలుగులోకి వస్తాయి. ప్రాంతీయ భాషల్లో కోర్సులను అందించడం వల్ల ఉన్నత విద్యను వీలైనంత ఎక్కువ మంది అభ్యసిస్తారనే లక్ష్యంతో మందుకు సాగుతున్నట్లు ఇగ్నో అధికారులు చెబుతున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న 60 అధ్యయన కేంద్రాలను 100కు పెంచాలని నిర్ణయించారు.ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సులనే తెలుగు మాధ్యమంలో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. ఆంగ్ల పరిజ్ఞానం లేనివారు కూడా ఈ కోర్సులు చేస్తే ఉపాధి అవకాశాలు లభించాలనేదే ఇగ్నో లక్ష్యమని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఇగ్నో పలు నైపుణ్య శిక్షణ కోర్సులు ప్రవేశపెట్టింది. ఆ కోర్సులను కొందరు చేస్తున్నారు. అయితే తెలుగులోకి అనువాదం చేస్తే మరింత మందికి ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం కోర్సును తెలుగులోకి తర్జుమా చేసే ప్రక్రియ ప్రారంభించారు. ఇవి 2018-19 విద్యాసంవత్సరం నాటికి అందుబాటులోకి వస్తాయి. 1. సర్టిఫికెట్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ ఐటీ స్కిల్స్ 2. సర్టిఫికెట్ ఇన్ టూరిజం స్టడీస్ 3. సర్టిఫికెట్ ఇన్ ఫంక్షనల్ ఇంగ్లిష్ 4. సర్టిఫికెట్ ఇన్ బిజినెస్ స్కిల్స్ 5. సర్టిఫికెట్ ఇన్ అర్లీఛైల్డ్‌హుడ్ అండ్ ఎడ్యుకేషన్ 6. సర్టిఫికెట్ ఇన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ 7. సర్టిఫికెట్ ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్
Related Images
Related News
కృష్ణా విశ్వవిద్యాలయంలో రెండు కొత్త పీజీ డిప్లమో కోర్సులు
కృష్ణా విశ్వవిద్యాలయం రెండు కొత్త పీజీ డిప్లమో కోర్సులను విద్యార్థుల
నాగార్జున విశ్వవిద్యాలయంలో సోషల్ పాలసీ, అంబేడ్కర్ ఐడియాలజీ సదస్సు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బ్రాహ్మణ వ్యతిరేకి
కోర్సులు.. మార్పులపై నాగార్జున యూనివర్శిటీలో సమీక్ష
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గురువారం 76వ అకడమిక్ సెనెట్ కమిటీ
కృష్ణా వర్శిటీలో 2017 పిజి సెట్ అడ్మిషన్లకు.. పోస్టర్ ఆవిష్కరణ
2017 పిజి సెట్ అడ్మిషన్లకు సంబంధించిన గోడపత్రికను కృష్ణా విశ్వవిద్యా ల
ఘనంగా ఎస్.ఆర్.కె. ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవం
విద్యార్థులు సామజిక, శాస్త్ర, సాంకేతిక అంశాలపై అవగాహన పెంచుకోవాల్సిన
ఇగ్నోలో తెలుగు మాధ్యమంలో కొత్త కోర్సులు
ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) కొన్ని కోర్సులను తెలుగ
ఉత్సాహంగా కృష్ణా యూనివర్శిటీ స్నాతకోత్సవం
మచిలీపట్నంలో కృష్ణా విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవం శనివారం ఆహ్లాద